చిట్యాల, నకిరేకల్ మండలాల బీఎస్పీ మహిళా కన్వీనర్లు ఎన్నిక

చిట్యాల, ప్రజానేత్రం, సెప్టెంబర్ 06: చిట్యాల మండల బిఎస్పి పార్టీ మహిళా కన్వీనర్ గా చిట్యాల మున్సిపాలిటీ చెందిన పాల భవాని ని, నకిరేకల్ మహిళ కన్వీనర్ మర్రి శోభ ఏక గ్రీవంగా నియమితులయ్యారు. వారికి బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాల భవాని మాట్లాడుతూ చిట్యాల మండలంలో మహిళలు ఎంతో వెనుకబడి ఉన్నారని, వారికోసం కష్టపడి పని చేస్తానని ఆమె అన్నారు. మహిళలను గుర్తింపు తెచ్చేవిదంగా బిఎస్పీ పార్టీ కీలకమైన పోస్టులు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. బహుజన్ సమాజ్ పార్టీలో మండల మహిళా కన్వీనర్ గా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉందని, పార్టీ అధినేత మాయావతిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారని, భవిష్యత్ కార్యాచరణలో చైతన్యవంతులు మహిళలు ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యతగా నిర్వహిస్తారని ఆమె అన్నారు. మహిళలను గుర్తించి కీలకమైన స్థానంను కల్పించడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే ఆ విలువలు దక్కుతాయన్నారు. తమ ఎన్నికకు సహకరించిన నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని కి కృతఙ్ఞతలు తెలిపారు.

Scroll to Top