మునుగోడును మున్సిపాలిటీతో పాటు, రెవిన్యూ డివిజన్ చెయ్యాలి: యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు…

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 06: నియోజకవర్గ కేంద్రం అయినా మునుగోడు మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి అభివృద్ధికి దూరం పెడుతుండడాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు ఆరోపించారు. బుధవారం అయన జిల్లా కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన మునుగోడుకి 200 కోట్లతో అభివృద్ధి చేయాలన్నారు. మునుగోడు పట్టణానికి వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, టెక్నికల్ కాలేజీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరును ప్రజల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. తప్పకుండా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అవసరం అయితే ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడికైనా సిద్ధమన్నారు. మునుగోడు పాత గ్రామా పంచాయితితో కలుపులుని మున్సిపాలిటీ చెయ్యాలని డిమాండ్ చేశారు. పేరుకే నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్దిలో వెనకబడిన మునుగోడును రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చెయ్యాలన్నారు, లేదంటే మునుగోడును నల్గొండ రెవిన్యూ డివిజన్ లోనే కొనసాగించాలని ఆవేదన వ్యక్తంచేశారు. మునుగోడు డిమాండ్లను నేరవేర్చకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.

Scroll to Top