రెవెన్యూ డివిజన్ కొరకు రాస్తారోకో…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షం అధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేసేంతవరకు ఉద్యమాన్ని ఆపెది లేదని అధికార ప్రజా ప్రతినిధులు తక్షణమే చిత్తశుద్ధి ఉంటే నాంపల్లి మండలం మీద రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల బస్టాండ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గాదేపాక వేలాద్రి, నాంపల్లి సంజీవ గడ్డం శ్రీనివాస్, అమరవీరుల సాధన సమితి అధ్యక్షుడు కోరే సాయిరాం, బిఎస్పి మండల నాయకులు పల్లెటి వినోద్ కుమార్, ఏద్ళుల కోటి, కోనేటి సాయికుమార్ విద్యార్థి సంఘం నాయకులు రజిత ,స్రవంతి, మైత్రి, వెంకట్ హరి కిషోర్, స్వప్న, మానవిక, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top