పంటల రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: పంట రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల ప్రాథమిక సహకార సంఘం లో ప్రభుత్వం రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేసిన 156 మంది రైతులకు చెక్కులను ఆయన అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అయిన రైతులు తిరిగి రుణాలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయ రంగంలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Scroll to Top