అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: మండలంలోని సోమవారం మల్లపురాజు పల్లి గ్రామానికి చెందిన కడారి రమేష్ (35) అన్మాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక ఎస్సై లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సమయంలో ఆవులను మేపడానికి పొలం దగ్గరికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి పొలం దగ్గరికి వెళ్లి వెతకగా అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై లచ్చిరెడ్డి సీఐ నవీన్ కుమార్ వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భార్య లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Scroll to Top