మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: చలమల్ల కృష్ణ రెడ్డి…

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: రానున్న ఎన్నికల్లో మునుగోడు గడ్డ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇంచార్జ్ చలమల్ల కృష్ణా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మండల అధ్యక్షుడు సూరిగి నర్సింహ అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వరంగల్ లో ప్రవేశ పెట్టిన డిక్లరేషన్ అమలు అవుతుందని ధీమానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులకు పెన్షన్లు పెరుగుతాయన్నారు. కుంట పడిన అభివృద్ధి, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి అవుతాయి. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ను వివరించి సైనికుల్లా పని చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటపడిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, నాయకులు నన్నురి విష్ణువర్ధన్ రెడ్డి. పాల్వాయి చెన్నారెడ్డి, పొలగోని సత్యం, మేక ప్రదీప్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నక్క వెంకన్న యాదవ్, పాలకూరి మహేష్, పట్టణ అధ్యక్షుడు దినేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top