తెలంగాణ

గృహలక్ష్మి లబ్ధిదారులకు హామీ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 08: సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో ఆదివారం గృహలక్ష్మి లబ్ధిదారులకు మండలానికి చెందిన 498 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు హామీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో పది నెలల్లోనే రూ.550 కోట్ల తో అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు.ఇందులో సగం పనులు పూర్తయ్యాయని రాబోయే రోజులలో మునుగోడును హైదరాబాదు దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి భానుమతి వెంకటేష్,పిఎసిఎస్ చైర్మన్ జక్కిడీ జంగారెడ్డి,ఎంపీడీవో రాములు, …

గృహలక్ష్మి లబ్ధిదారులకు హామీ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి Read More »

విద్యార్థి ఉద్యమకారుల సమావేశం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 08: మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఈనెల 11 రోజున మర్రిగూడ శాలివాహన జూనియర్ కాలేజీలో జరిగే ఉద్యమకారుల సమావేశం వాల్ పోస్టర్ సంస్థాన్ నారాయణపురం మండల చౌరస్తాలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షులు నారపాక అంజి మాదిగ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మునుగోడు నియోజకవర్గ చైర్మన్ మాల్గ యాదయ్య, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఇంచార్జ్, ఏoఎస్ఎఫ్ జాతీయ నాయకులు జిల్లా …

విద్యార్థి ఉద్యమకారుల సమావేశం వాల్ పోస్టర్ ఆవిష్కరణ Read More »

బీజేపి నుండి బిఆర్ఎస్ లో చేరిన సర్పంచ్ కాట్రోతు శీను

సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 06: సంస్థాన్ నారాయణపురం మండలంలోని కడిలబావి తండాకు చెందిన బిజెపి సర్పంచ్ కాట్రోతు శీను గుడిమల్కాపురం ఎంపీటీసీ శివరాత్రి కవితా సాగర్ ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సర్పంచ్ ను పార్టీలోకి ఆహ్వానించారు.

టియుడబ్ల్యూజే (ఐజేయు) నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా నక్క శ్రీనివాస్…

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 6: నాంపల్లి మండలంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ గా పనిచేస్తున్న దామెర గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) మునుగోడు నియోజకవర్గం సహాయ కార్యదర్శిగా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు కేసాని శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు …

టియుడబ్ల్యూజే (ఐజేయు) నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా నక్క శ్రీనివాస్… Read More »

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం…

చిట్యాల, ప్రజానేత్రం, అక్టోబర్ 06: గుండ్రాంపల్లి గ్రామంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్ రత్నం పుష్పమ్మ నర్సింహా అన్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో కీ. శే పానుగుల్ల సైదులు గౌడ్ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి పానుగుళ్ళ సుజాత శ్రీసాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో శ్రీఆధ్య హాస్పిటల్ వారి సౌజన్యంతో గ్రామస్థులకు బీపీ, షుగర్ వ్యాధులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి …

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం… Read More »

మాయ మాటలను నమ్మి సంక్షేమాన్ని మరువద్దు: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 05: కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకుల మాయమాటలను నమ్మి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను మరువ వద్దు అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గట్లమల్లేపల్లి నుండి తుమ్మలపల్లి వరకు రూ.2.34 కోట్లు, కేతేపల్లి నుండి తిరుమలగిరి వరకు రూ.1.62 కోట్లు, మల్లెపల్లి రోడ్డు నుండి బండ తిమ్మాపురం వరకు రూ.1.35 కోట్లు, చల్లవానికుంట నుండి కలమంద బావి తండ వరకు రూ.1.40 కోట్లు , …

మాయ మాటలను నమ్మి సంక్షేమాన్ని మరువద్దు: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి Read More »

నాంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 5: మండల కేంద్రమైన నాంపల్లిలో అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రెవిన్యూ డివిజన్ సాధన కోసం నిరాహార దీక్షలు చేస్తున్న ఉద్యమకారులపై రోజుకు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు తీసుకొని ఉద్యమం చేస్తున్నారని అనుచిత, అసత్య ఆరోపణలు చేయడంతో గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బుధవారం నాంపల్లి నుండి కొండమల్లేపల్లి కి వెళ్లే ఆర్ …

నాంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం Read More »

బతుకమ్మ చీరలను పంపిణి చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేఎం గౌరీష్…

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, అక్టోబర్ 05: తెలంగాణ సర్కారు కానుకగా అందించే బతుకమ్మ చీరలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేఎం గౌరీష్ గురువారం మహిళలకు అందించారు. ఈ సందర్బంగా మహిళలకు బతుకమ్మ కానుకగా ప్రభుత్వం చీరలు అందజేస్తుందన్నారు. బతుకమ్మ పండుగనాటికి మహిళలందరికీ చీరల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు.

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన: శైలజ చరణ్ రెడ్డి దంపతులు

చిత్తూర్, ప్రజానేత్రం, అక్టోబర్ 04: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశిస్సులు ప్రజల పై ఉండాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్ పర్సన్ శైలజా చరణ్ రెడ్డి స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. బుదవారం అగరంపల్లిలోని తమ నివాసం నుండి పట్టు వస్త్రాలు, లాంఛనాలతో ఘనంగా బయలుదేరి అగరంపల్లి సత్తమ్మ గుడిలో పూజ ముగించుకొని కానిపాకం వరసిద్ధి వినాయక స్వామి సన్నిధికి చేరుకున్నారు. వారికీ కాణిపాకంలో ఆలయ అధికారులు కోదండపాణి, బాబులు …

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన: శైలజ చరణ్ రెడ్డి దంపతులు Read More »

నాంపల్లిని అభివృద్ధి చెయ్యకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చిన్న చూపు…

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 04: నాంపల్లి మండల కేంద్రాన్ని అభివృద్ధికి నోచుకోకుండా అధికార పార్టీ చిన్నచూపు చూస్తున్నారని బిజెపి మండల యువ నాయకులు గాదేపాక నాగరాజు ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాంపల్లి ని రెవెన్యూ డివిజన్ చేయాలని గత 21రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తుందని అన్నారు. అఖిలపక్ష నాయకులను చిన్నచూపు చూస్తున్నారని మండి పడ్డారు. నాంపల్లి అభివృద్ధి కోసం రెవెన్యూ డివిజన్, …

నాంపల్లిని అభివృద్ధి చెయ్యకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చిన్న చూపు… Read More »

Scroll to Top