చిట్యాల, ప్రజానేత్రం, అక్టోబర్ 06: గుండ్రాంపల్లి గ్రామంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్ రత్నం పుష్పమ్మ నర్సింహా అన్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో కీ. శే పానుగుల్ల సైదులు గౌడ్ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి పానుగుళ్ళ సుజాత శ్రీసాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో శ్రీఆధ్య హాస్పిటల్ వారి సౌజన్యంతో గ్రామస్థులకు బీపీ, షుగర్ వ్యాధులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో సుమారు 370 మందికి వైద్యులు డా. రాకేష్, డా. మోహన్ వైద్యపరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఎస్ఐ రవి వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండి డి. రాజు, ఆసుపత్రి సిబ్బంది మౌనిక, పావని, రాజు, క్రాంతి నాయకులు మారగోని శివశంకర్ గౌడ్, అంతటి శ్రీనివాస్, బొడిగే సైదులు, పానుగుల్ల వెంకటేశం, బుస్సు లింగస్వామి, బొడిగె బాలరాజు, పానుగుల్ల పవిత్ర, కుంభం భాషయ్య, బొడిగె బక్కశెట్టి, అంజన్ కుమార్ ( బబ్బులు), బొడ్డు శ్రీనివాస్ , బొడ్డు స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.