ప్రజల పక్షాన పోరాడిన సామాజిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న: ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

  • ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో గౌడ కులస్తుల సంక్షేమానికి పెద్దపీట, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన: ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

సూర్యాపేట, ప్రజానేత్రం, అక్టోబర్ 05: ప్రజల పక్షాన పోరాడిన సామాజిక ఉద్యమ నాయకుడు బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తుంగతుర్తి శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఘనుడు పాపన్న గౌడ్ అని అన్నారు .పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మనలను మనం గౌరవించుకోవడమేనని అన్నారు .వరసగా రాజ్యాలను జయించుకుంటూ చివరగా గోల్కొండ ఖిలాపై జెండా ఎగరవేసిన విప్లవ వీరుడు పోరాటయోధుడు సర్వాయి పాపన్న అని ఎమ్మెల్యే అన్నారు. నాడు మొగల్ కాలంలో వారికి ఎదురు తిరిగిన వారు ఇరువురిని వారిలో ఒకరు చత్రపతి శివాజీ కాగా రెండవ వారు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు .సర్వాయి పాపన్న ఆనాడే 27 రకాల చెట్ల నుండి కల్లును ఉత్పత్తి చేశాడని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక ఉద్యమకారులను గుర్తించడంలో భాగంగా సర్వాయి పాపన్న గౌడ్ తో పాటు దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ ,కొమరం భీమ్ లాంటి పోరాట యోధులను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం స్మరించుకుంటూ వారి జయంతి వర్ధంతిలను అధికారికంగా ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం గీత కార్మికులకు శిస్టులు రద్దు చేశారని కళ్ళు కాంపౌండ్ల పునరుద్ధరణ చేపట్టారని రెండు లక్షల ఎక్స్గ్రేషియాను 5 లక్షల పెంచడం 50 సంవత్సరాలకే పెన్షన్ అందించడం లాంటి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని అన్నారు.

త్వరలో గీత కార్మికులకు హెల్త్ కార్డులు వాటితో పాటు సేఫ్టీ మూకులు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తుంగతుర్తి మండలం లో పది కోట్ల రూపాయల విలువగల సేఫ్టీమోగులను గీత కార్మికులకు ప్రభుత్వం నుండి అందేలా చూసే బాధ్యత తనదేనని అన్నారు . గౌడ సొసైటీ భవనానికి తన వంతుగా 15 లక్షల రూపాయలు ఇచ్చామని మరో 10 లక్షలు ఎంపీ నిధుల నుండి మంజూరు ఇవ్వాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జదీపిక యుగంధర్ రావు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ,బీసీ కార్పొరేషన్ కమిషనర్ బుర్ర వెంకటేష్ గౌడ్, బీసీ కార్పొరేషన్ మెంబర్ కిషోర్ గౌడ్, గీత సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు ,రైతు సమన్వయ కమిటీ చైర్మన్ రజాక్ ఎంపీపీ కవితా రాములు గౌడ్ ఎక్స్ ఏఎంసీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, గౌడ సంఘం నాయకులు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top