మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ దే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి…

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 27: దేశంలో ఎక్కడ లేని విధంగా మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ టీచర్లు గా అప్గ్రేడ్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ అధ్వర్యంలో సిఎం కేసీఆర్ చిత్ర పటానికి నల్గొండ క్లాక్ టవర్ వద్ద జరిగిన పాలాభిషేకం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ టీచర్ విధులు, ఆయా విధులు రెండు నిర్వర్తిస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని,గత ఏడు సంవత్సరాలుగా మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ స్థాపించి, ప్రభుత్వానికి మీ సమస్యలను సామరస్యంగా తెలపడం వల్లన నేడు రాష్ట్రంలో ఉన్న 3989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ అప్గ్రేడ్ చేసారని ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు అని తెలిపారు. అనంతరం మినీ అంగన్వాడీ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి తమకు ఎల్లవేళలా సహకరిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు, మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కు, సత్యవతి రాథోడ్ లకు ఎల్లవేళల మాకు సహాయ సహకారాలు అందిస్తు నేటి కార్యక్రమానికి విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి, నల్గొండ జిల్లా మినీ అంగన్వాడీ టీచర్స్ అధ్యక్షురాలు గుడిసె ఇందిరా, బీఆర్టీయు నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి అవుట రవీందర్,ప్రధాన కార్యదర్శి సుహాసిని, కమిటీ మెంబర్లు సబితా,రాములమ్మ,చంద్రకళ,శైలజ,అనూష, భాగ్య, దనమ్మ, నాగేంద్ర, జయమ్మ, కమల, లలిత, జిల్లా మినీ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Scroll to Top