మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్

హైదరాబాద్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 12: ఇటీవల విదేశీ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకొని హైదరాబాద్ కు చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాధరి కిశోర్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు స్వయంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top