బొడ్రాయి మహోత్సవంలో పాల్గొన ఎమ్మెల్యే కెపి వివేకానంద్

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 12: నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని నందా నగర్ లో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ భూలక్ష్మి సమేత శీతలాంబ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవానికి మంగళవారం ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అథితిదిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నందనగర్ బస్తీ వాసులకు బొడ్రాయి పండుగ శుభాకాంక్షలను తెలుపుతూ, బొడ్రాయిని ఊరి గ్రామ రక్షకుడిగా కొలుచుకుంటాము, ఊరంతా సంతోషంగా ఉండాలని, ఎటువంటి అరిష్టాలు, ఆటంకాలు జరగకుండా ఉండాలని ఆయన ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో నందా నగర్ సంక్షేమ సంగమ్ అద్యేక్షులు కార్తీక్ గౌడ్, హరి బాబు, నర్సింగ్ రావు, ధర్మ రావు, రాజేష్, శంకర్, దాసు, మధు, శివ, సాయి, లక్ష్మణ్, అనిల్, నందనగర్ బొడ్రాయి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top