నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 12: మండల రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఆధ్వర్యంలో నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అన్ని అర్హతలు కలిగిన నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ తక్షణమే ప్రకటించాలని అధికార ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి ఉంటే నాంపల్లి మండల రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడాలని లేదంటే అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే నిరవధిక దీక్షలకు మద్దతుగా కూర్చుని వాళ్ళ అభిప్రాయాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం, గుమ్మడి రవీందర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బుషిపాక నరసింహ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పన్నాల మల్లయ్య, పెరుమల్ల రాజు, జి యాదగిరి, ఎం శివ గౌడ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top