బోడుప్పల్ 4వ డివిజన్ లో మంచినీటి పైప్లైన్ ప్రారంభం

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం: కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 4వ డివిజన్లోని అన్ని కాలనీల్లో త్రాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని బోడుప్పల్ 4వ డివిజన్ కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ అన్నారు. ఆదివారం బోడుప్పల్ 4వ డివిజన్లోని న్యూ భవాని నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవంకు వారు ముఖ్య అతిథిగా పాల్గొని మంచినీటి నల్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, డ్రైనేజీ, వసతులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసర్ల బీరప్ప,న్యూ భవాని నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top