టియుడబ్ల్యూజే (ఐజేయు) నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా నక్క శ్రీనివాస్…

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 6: నాంపల్లి మండలంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ గా పనిచేస్తున్న దామెర గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) మునుగోడు నియోజకవర్గం సహాయ కార్యదర్శిగా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు కేసాని శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపారు. జర్నలిస్టుల సమస్యలపై వాటి పరిష్కారాలకు కృషి చేస్తామన్నారు.

Scroll to Top