సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 08: సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో ఆదివారం గృహలక్ష్మి లబ్ధిదారులకు మండలానికి చెందిన 498 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు హామీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో పది నెలల్లోనే రూ.550 కోట్ల తో అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు.ఇందులో సగం పనులు పూర్తయ్యాయని రాబోయే రోజులలో మునుగోడును హైదరాబాదు దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి భానుమతి వెంకటేష్,పిఎసిఎస్ చైర్మన్ జక్కిడీ జంగారెడ్డి,ఎంపీడీవో రాములు, తాసిల్దార్ కృష్ణ,పలు గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.