నాంపల్లిని అభివృద్ధి చెయ్యకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చిన్న చూపు…

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 04: నాంపల్లి మండల కేంద్రాన్ని అభివృద్ధికి నోచుకోకుండా అధికార పార్టీ చిన్నచూపు చూస్తున్నారని బిజెపి మండల యువ నాయకులు గాదేపాక నాగరాజు ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాంపల్లి ని రెవెన్యూ డివిజన్ చేయాలని గత 21రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తుందని అన్నారు. అఖిలపక్ష నాయకులను చిన్నచూపు చూస్తున్నారని మండి పడ్డారు. నాంపల్లి అభివృద్ధి కోసం రెవెన్యూ డివిజన్, డిగ్రీ కళాశాల, బస్టాండు, పాలిటెక్నిక్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని దీక్ష కూర్చుంటే, డబ్బులు తీసుకొని కాలయాపనగా కూర్చుని దీక్ష చేస్తున్నారని మా పై నిందలు మోపడం ఎంతవరకు సమంజసం చెప్పాలన్నారు.

Scroll to Top