శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని పోస్ట్ ఆఫీస్ ముందు పోస్టల్ ఉద్యోగుల ధర్నా మద్దుతుగా ఎమ్మెల్యే కూసుకుంట్ల

  • ధర్నాకు మద్దతు తెలిపిన మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 04: సంస్థాన్ నారాయణపురం తపాలా విభాగంలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులు జీడీఎస్ పి జెసిఏ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రోజున నారాయణపూర్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట జీడిఎస్ ఉద్యోగులు ధర్నాలో నిర్వహించారు. ఈ ధర్నాకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, తమను కేంద్ర ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, ఎనిమిది గంటల పని సమయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బల్లెం రామస్వామి, గంట కృష్ణారెడ్డి, శ్రీపతి నర్సిరెడ్డి, శ్రీరామదాసు సత్యనారాయణ, అప్పిడి వెంకట్ రెడ్డి, అలిసేరి చిరంజీవి, ఏం భాను,వల్లూరి జంగయ్య, కే సౌమ్య, బి భాస్కర్, ఈ వంశీ, ఈ సమ్మెకు మద్దతుగా పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.

Scroll to Top