శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన: శైలజ చరణ్ రెడ్డి దంపతులు

చిత్తూర్, ప్రజానేత్రం, అక్టోబర్ 04: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశిస్సులు ప్రజల పై ఉండాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్ పర్సన్ శైలజా చరణ్ రెడ్డి స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. బుదవారం అగరంపల్లిలోని తమ నివాసం నుండి పట్టు వస్త్రాలు, లాంఛనాలతో ఘనంగా బయలుదేరి అగరంపల్లి సత్తమ్మ గుడిలో పూజ ముగించుకొని కానిపాకం వరసిద్ధి వినాయక స్వామి సన్నిధికి చేరుకున్నారు. వారికీ కాణిపాకంలో ఆలయ అధికారులు కోదండపాణి, బాబులు వేద పండితుల ఆహ్వానంతో మేల వాయిద్యాల నడుమ వెళ్లి మొదట స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి తదుపరి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు లాంఛనాలతో సమర్పించారు. తదుపరి వేద పండితుల ఆశీర్వచనం కల్పించారు. ఈ సందర్బంగా జగన్న పాలనలో ప్రజలంతా సంతోషాలతో ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వ అధికారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కానిపాకం ఉప సర్పంచ్ విశ్వనాథరెడ్డి, చిన్నకాంపల్లి సర్పంచ్ పురుషోత్తం రెడ్డి గుండ్లపల్లి ఎంపీటీసీ లోకేశ్వర్ రెడ్డి, మారం సురేష్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి మాజీ టెంపుల్ చైర్మన్, ఐరాల మండలం ఎక్స్ వైస్ ఎంపీపీ జగన్నాథ రెడ్డి, తేనేపల్లి బాబు రెడ్డి , రమేష్, హేమ్ కుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top