నాంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 5: మండల కేంద్రమైన నాంపల్లిలో అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రెవిన్యూ డివిజన్ సాధన కోసం నిరాహార దీక్షలు చేస్తున్న ఉద్యమకారులపై రోజుకు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు తీసుకొని ఉద్యమం చేస్తున్నారని అనుచిత, అసత్య ఆరోపణలు చేయడంతో గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బుధవారం నాంపల్లి నుండి కొండమల్లేపల్లి కి వెళ్లే ఆర్ అండ్ బి డబుల్ రోడ్డు నిర్మాణపు పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో కలిసి వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే, ఉద్యమకారులు మంత్రికి వినతి పత్రం సమర్పిస్తుండగా అక్కడే ఉన్న ఎమ్మెల్యే రెవిన్యూ డివిజన్ ఉద్యమకారులు డబ్బులు తీసుకొని ఉద్యమం చేస్తున్నారని ఆరోపించడంతో ఎంతో మానసిక శోభకు గురైన ఆందోళనకారులు అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంటనే తన పద్ధతి మార్చుకొని ఆందోళనకారులకు క్షమాపణ చెప్పకుంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. చావు తప్పి కన్నులు లొట్ట పోయినట్టు మునుగోడు ఉప ఎన్నికల పుణ్యాన రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి పై వివక్ష చూపుతో ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి మంజూరు అయితే హెచ్ఎండిఏ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాదు విజయవాడ ప్రధాన జాతీయా రహదారిపై ఉన్న, చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రి ఎలా నిర్మిస్తారని, నాంపల్లి, మర్రిగూడెం, చండూరు, గట్టుపల్, మునుగోడు మండలాలకు ఆ వంద పడకల ఆసుపత్రి వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంత మండలాలను విస్మరించి హైదరాబాదుకు పూత వేటు దూరంలో ఉన్న చౌటుప్పల్ లో ఆస్పత్రి ఏర్పాటు చేయడం వల్ల మునుగోడు నియోజకవర్గం లోని గ్రామీణ మండలాలకు తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్యే పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే సంస్థాన్ నారాయణపురం లో రెసిడెన్షియల్ పాఠశాల ఉండగా మరో రెసిడెన్షియల్ పాఠశాలను మళ్లీ తన సొంత మండలంలో ఏర్పాటు చేసుకున్నారని, వారన్నారు.1982లో నల్లగొండ తాలూకా నుండి కొత్త తాలూకా ఏర్పడిన చండూరు నుండి సంస్థాన్ నారాయణపురం మండలాన్ని చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్లో కలిపేసుకున్న ఎమ్మెల్యే నూతనంగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చండూరు మండల ప్రజలకు రెవిన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చి రెవిన్యూ డివిజన్ చేశారని, అదే సమయంలో పూర్వపు దేవరకొండ తాలూకా నుండి 40 సంవత్సరాల క్రితం తాలూకా కేంద్రంగా ఏర్పడిన నాంపల్లి ని చండూరు రెవిన్యూ డివిజన్లో ఎలా కలుపుతారని ఆందోళనకారులు ప్రశ్నించారు. గత 22 రోజులుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నాంపల్లి రెవిన్యూ డివిజన్ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, రెవిన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులపై ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి ని రెవిన్యూ డివిజన్ చేసేవరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ప్రస్తుతం నాంపల్లి ని రెవెన్యూ డివిజన్ చేయడం సాధ్యం కాకపోతే యధావిధిగా దేవరకొండ రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా నాంపల్లి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, ఐటిఐ, వంద పడకల ఆసుపత్రి, బస్ స్టేషన్, బస్ డిపో, మాల్ నుండి ముసలమ్మ చెట్టు వరకు, మల్లెపల్లి నుండి నాంపల్లి మునుగోడు ద్వారా చిట్యాల వరకు నాలుగు వరసల రోడ్లు ఏర్పాటు చేయాలని, వారు డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు , మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మొగుదాల పార్వతమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదేపాక వేలాద్రి, నాంపల్లిసంజీవ, బీఎస్పీ మండల శాఖ అధ్యక్షుడు పల్లె వినోద్ కుమార్, ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఇరిగి సుధాకర్ మహారాజ్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఊరి పక్క వెంకటయ్య, గిరి స్వామి, ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు బుష్పాక శాంతి కుమార్ , దీవెన ఫౌండేషన్ చైర్మన్ బుష్పాక వెంకటయ్య, బీజేవైఎం జిల్లా కోశాధికారి పానుగంటి వెంకటయ్య గౌడ్, బీజేవైఎం మండల శాఖ అధ్యక్షుడు నాంపల్లి సతీష్, డోలు దెబ్బ అధ్యక్షుడు పొన్నాల మల్లయ్య యాదవ్, సోషల్ మీడియా కన్వీనర్ గాదేపాక నాగరాజు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మంగి మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.కె చాంద్ పాషా, అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం, ఆందోళన కార్యక్రమంలో పాల్గొని రాస్తారోకో, దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

Scroll to Top