మృతుని కుటుంబానికి 50వేల ఆర్థిక సాయం అందజేత

చిట్యాల,ప్రజానేత్రం, ఆగష్టు 20: మండలం లోని చిన్న కాపర్తి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొండ ప్రసాద్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఆదివారం దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆగ్రామంలోని హరిహర అంబికా ఆంజనేయ లారీ డ్రైవర్స్ యూనియన్ చిన్నకాపర్తి సభ్యులు హాజరై మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. యూనియన్ తరపున సేకరించిన 50వేల రూపాయల నగదును మృతుని కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఆర్ధిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కొత్త వెంకటేశం గౌడ్, ఉపాధ్యక్షుడు మెట్టు నరసింహ, కార్యదర్శి గురిజ సుధాకర్, కోశాధికారి వీరమల్ల రాములు, సలహాదారుడు పాకాల నరసింహ, కార్యవర్గ సభ్యులు కొత్త భాస్కర్ గౌడ్, మామిడి అశోక్ గౌడ్, ఆవుల సత్తయ్య, కొత్త మల్లేష్, పల్లపు వెంకన్న, చిట్టిపోలు శివ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top