మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 17: తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.భీమ్ రెడ్డి నగర్ లో లో మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ప్రజలదేనని,మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా భావించినప్పుడే కెసిఆర్ కలలుగన్న ‘హరిత తెలంగాణ’ సాధ్యమవుతుందని,భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందమైన ప్రకృతిని బహుమతిగా ఇవ్వాలని అందుకు ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో జరిగే జరిగే శుభకార్యాలకు సీత మొక్కలు పెంచడం అలవాటుగా మారాలని సింగిరెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పన్నాల బుచ్చిరెడ్డి,5వ డివిజన్ బి ఆర్ స్ అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ,కరుణాకర్,వెంకటా చారి,గోపిరెడ్డి,ఉపేందర్,రమేష్ ,లక్ష్మయ్య,డివిజన్ మహిళలు,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.