నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 21: ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎంపీపీ ఎడు దొడ్ల శ్వేతా అన్నారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం మాట్లాడారు. ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. వాటిని అమలు చేసే అధికారులు నిర్లక్ష్యం వదిలి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా కృషి చేయాలన్నారు. సర్వసభ్య సమావేశానికి అధికారం ఆలస్యం రావడంతో తమ అసహనం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారులు సమయపాలన పాటించకపోతే ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ముఖ్యంగా మండల పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి పని చేస్తున్న పాఠశాలలో నిధులు సక్రమంగా నిర్వహించకుండా సంఘాల పేరుతో విద్యార్థుల జీవితాతో చెలగాటమాడటం సరికాదన్నారు. చిట్టెంపాడు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల భవనం విద్యాధికారులు ఆధీనంలోకి తీసుకోవాలని విద్యా వ్యవస్థ పై మండల వ్యాప్తంగా ఉన్న పూర్తి వివరాలను వారంలోగా తనకు సమర్పించాలన్నారు. పేద విద్యార్థుల సదువులకై ప్రభుత్వం లక్షల రూపాయల ఖర్చు చేస్తున్న ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు దూరం అయితున్నారంటే ఎవరి నిర్లక్ష్యం ఉందో తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు ఉచితంగా అనేక రకమైన వైద్య సేవలు అందుతున్నాయని ప్రజలు వారిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దేవా సింగ్, ఎంపీడీవో శేషు కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు రమావత్ రవి నాయక్, మునగాల సుధాకర్ రెడ్డి, బాష్పాక రాములు, అంగిరేకుల పాండు, బత్తుల వంశీ, ఎస్కే అబ్బాస్, బెక్కం రమేష్, కోరే హేమలత, నాగులవంచ శ్రీలత, అన్నిపాక సరిత, కొమ్ము యాదమ్మ, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.