విద్యార్థుల కు రాగి జావా తాగడానికి బౌల్స్, బాటిల్స్ పంపిణీ…
సంస్థాన్, ప్రజానేత్రం, డిసెంబర్ 30: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..అనంతరం విద్యార్థుల కు ఉదయం పాఠశాలలో రాగి జావా తాగే బౌల్స్, బాటిల్స్ ని శ్రీ వైష్ణో దేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల,బాలుర పాఠశాలలో విద్యార్థుల కు గుత్తా యువసేన అధ్యక్షులు,ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయి కి ఎదగాలని మీ పాఠశాలకు కావాల్సిన అవసరాలను అందించడం జరుగుతుందన్నారు.అమిత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ వైష్ణో దేవి ఫౌండేషన్ వారికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగేట్టి రమాదేవి,పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ సోమనబోయిన కృష్ణ కుమారు, శ్రీ వైష్ణో దేవి ఫౌండేషన్ చైర్మన్ పన్నాల రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు చిలివేరు రమేష్, గుదే లింగస్వామి, తీగల రాజ్ శేఖర్ రెడ్డి, చిలివేరు గోపి, బర్ల వెంకటేష్, దోటి గణేష్, చిరంజీవి, మన్నే సాయి, బద్దం వెంకట్ రెడ్డి,శంకర్,సాక్షి గణపతి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.