బూర నర్సయ్య గౌడ్ ను అధిక మెజార్టీ తో గెలిపించాలి

మునుగోడు, ప్రజానేత్రం, మే 05: బిజెపి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలనీ బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు మాదగోని నరేందర్ గౌడ్ కోరారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడువ సారి ప్రధానిని చేయడం కోసం భువనగిరి లో బూర నర్సయ్య గౌడ్ ని ఎంపీ గా గెలిపించాలని ప్రజా సమస్యల పరిష్కారం గ్రామల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ గత పది సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని దేశానికి ప్రపంచ దేశాలలో గొప్ప పేరు తీసుకోవచ్చిన మోడీని మరోసారి ప్రధానిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మండల పార్టీ ఉపాధ్యక్షుడు కర్శాటి శేఖర్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు పందుల యాదయ్య, సీనియార్ నాయకులు దుబ్బ జెల్లయ్య, 159 బూతు కమిటీ అధ్యక్షులు పోలే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top