తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు దేశానికి తలమానికం: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

సంస్థాన్, ప్రజానేత్రం,అక్టోబర్ 04: సంస్థాన్ నారాయణపురం మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ గురుకుల విద్యాలయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మన నియోజకవర్గంలోనే 6 రెసిడెన్షియల్ స్కూల్స్, నిర్మించుకున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొట్టమొదటి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ ఇదే మొదటిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్,గ్రామ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, వైస్ ఎంపీపీ ఆంగోతు రాజు నాయక్,ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య యాదవ్,తహసిల్దార్ కృష్ణ, ఎంపీడీవో రాములు, వివిధ గ్రామాల సర్పంచులు,బిఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top