బోడుప్పల్ కార్పొరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారిగా చేరికలు..

  • రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బోడుప్పల్ కార్పొరేషన్ మాజీ ఎంపీటీసిలు, మాజీ వార్డు సభ్యులు, నేతలు

మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 01: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారంనాడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి బోడుప్పల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు మాజీ ఎంపీటీసీలు,వార్డు సభ్యులు, నేతలు టీపీసీసీ ఉపాధ్యక్షుడు,మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి నేతృత్వంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో తొంబై రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దాని కోసం ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాడాని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మాజీ వార్డ్ సభ్యుడు సీనియర్ నాయకుడు బొమ్మకు రమేష్, మాజీ ఎంపీటీసీలు దేవరకొండ వీరాచారీ, తోటకూర అశోక్ యాదవ్, టీడీపీ 1వార్డ్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రసాల కుమార్ యాదవ్, 3 వార్డ్ ఇండిపెండెంట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ దుడేళ్ల రాజు ముదిరాజ్, యువ నాయకుడు పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొన్నం తరుణ్ గౌడ్, మేడ్చల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్, కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్, బొమ్మకు కళ్యాణ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రధానా కార్యదర్శులు కొత్త ప్రభాకర్ గౌడ్, విశ్వం గుప్త, సీనియర్ నాయకులు బాలరాజ్ గౌడ్, రాపోలు శంకరయ్య, పోగుల వీరారెడ్డి, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుర్రి శివ శంకర్,పోగుల దిలీప్ రెడ్డి, తోటకూర రాజు యాదవ్, హరినాథ్ రెడ్డి, సింగిరెడ్డి రాజు రెడ్డి, కందుకూరి నవీన్, మైసగాళ్ల రాజు, చీరాల జంగయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top