నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 04: రూ.32.50 కోట్ల రూ. నిధులతో నాంపల్లి నుండి ముష్టిపల్లి వరకు గల డబల్ రోడ్డు పనులకు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ లతో కలిసి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సహకార సంఘం చైర్మన్ పల్లె రవికుమార్, ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుమ్మాడపు నరసింహారావు, అధికార ప్రతినిధి పొంగుల వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, పాన్నగంటి వెంకన్న, మునగాల సుధాకర్ రెడ్డి, కడారి శ్రీశైలం యాదవ్, సభావత్ సర్దార్ నాయక్, తుమ్మలపల్లి గోపాల్ రెడ్డి, కోరే యాదయ్య, బల్గురి విష్ణువర్ధన్, బాసిపాక రాములు, జిల్లెల్ల సైదులు, కారింగు నరసింహ, బోయపల్లి చంద్రయ్య తదితరులు పాల్గొనారు.