మునుగోడు, ప్రజానేత్రం, అక్టోబర్ 26: ధర్మ సమాజ్ పార్టీ మొదటి మహా సమ్మేళన కరపత్రాలు ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బుడిగపాక లింగస్వామి మహారాజ్ మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భంచి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందున, నవంబర్ 3వ తేదీన మొదటి ఆవిర్భావ మహా సమ్మేళనం జరుపుకుంటున్నామని, కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరౌతారని అన్నారు. ఈ సభను బీసీ, ఎస్సీ, ఎస్టీ, డి.ఎఫ్.సి, రిలీజియన్ మైనారిటీ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ గడ్డమీద ప్రజల సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మండల నాయకులు లక్ష్మయ్య, సైదులు, ఉపేందర్ తదితరులు పాల్గోన్నారు.