భువనగిరి, ప్రజానేత్రం, ఏప్రిల్ 23: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25వ తేదిన జరిగే మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కెసిఆర్ రోడ్డు షో ను జయప్రదం చేయాలని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. అనంతరం కేసిఆర్ రోడ్డు షో ఏర్పాట్లను భువనగిరి జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు పైళ్ల శేఖర్ రెడ్డి, బిక్షమయ్య గౌడ్ లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, బిఆర్ఎస్ భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, జడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ కిష్టయ్య, నాయకులు నల్లమస రమేష్ గౌడ్, చందుపట్ల రాజేశ్వరరావు, కేశపట్నం రమేష్, బాల్గురి మధుసూదన్ రెడ్డి, కంచు మల్లయ్య, నర్సిరెడ్డి, జక్కా రాఘవేంద్ర రెడ్డి, సందల సుధాకర్, అబ్బగాని వెంకట్ గౌడ్, చిన్నం పాండు, ర్యాకల శ్రీనివాస్, బొమ్మారం సురేష్, రాసాల మల్లేష్, పుట్ట వీరేశం, కస్తూరి పాండు, సత్యనారాయణ పాల్గొన్నారు.