నాయి బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాల: మండల అధ్యక్షులు శికిలమెట్ల ప్రభాకర్

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 15: జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా సంస్థాన్ నారాయణపురం ఎంపికై సందర్భంగా గ్రామ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి కి అభినందనలు తెలియాజేసి,శాలువతో సన్మానించిన నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు,నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు శికిలమెట్ల ప్రభాకర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో బీసీ బంధును ప్రవేశపెట్టిందని,మండల పరిధిలోని అర్హులైన నాయి బ్రాహ్మణ ప్రతి బిడ్డకు బీసీ బంధు వర్తింపజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు శికిలమెట్ల వెంకటేశం,సంఘ నాయకులు శ్రీనివాస్, బిక్షం, హరి, శ్రవణ్, శశికాంత్, దోమలపల్లి కిరణ్, సికిలమెట్ల సురేష్ ,హేమెందర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top