కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శైలజ చరణ్ రెడ్డి, మండల కన్వీనర్ బుజ్జీ రెడ్డి, జడ్పిటిసి సుచిత్ర
ఐరాల, ప్రజానేత్రం, ఏప్రిల్ 19: పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకురాలు రమాదేవి గురువారం తిరిగి వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయ్యారు. ఆమెకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్పర్సన్ శైలజ చరణ్ రెడ్డి, ఐరాల మండల వైసీపీ కన్వీనర్ బుజ్జి రెడ్డి, ఐరాల జడ్పిటిసి సుచిత్ర లు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ నేను 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను 2014లో కార్యకర్తగానే పనిచేశాను 2019లో టికెట్ కోసము కష్టపడ్డాను లాస్ట్ మినిట్ లో టికెట్ నాకు దక్కలేదు. 2024 లో కూడా నాకు కంపల్సరీ వస్తుంది అనుకున్నాను, కానీ అనివార్యకారనాల వలన టికెట్ రాలేదు.ఆ బాధతో కొంచం నేను డిప్రెషన్ కి వెళ్ళాను తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేను. తర్వాత ప్రెస్ మీట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత టిడిపి నాయకులు ఎంతగానో నన్ను ప్రలోభాలకు గురిచేసి టిడిపి లో చేర్చుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా టిడిపిలో చేరకుండా వైసిపి పార్టీ నాయకులు పెద్దలు వాళ్లంతా నా ఇంటికి రావడం జరిగింది నన్ను కలిసి నన్ను ఒప్పించి, నాకు భరోసా ఇచ్చి రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తే మంచి గుర్తింపు అనేది ఉంటుంది అనేసి వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది అలాగే లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కూడా మాట్లాడడం జరిగిందన్నారు. మా అక్క చెల్లెలా నిన్ను చూసుకుంటానమ్మా నీకు ఎక్కడ గాని అగౌర పరచను నేను మా అక్క చెల్లి లాగే చూసుకుంటాను సపోర్ట్ చేయమ్మా నేనున్నానమ్మ అని రాబోయే రోజుల్లో నిన్ను మంచి స్థానంలో నిలబెడతానని ఒక భరోసా ఇచ్చారు. నాకు కూడా సొంత ఇంటికి రావడం ఆనందంగా ఉన్నందువల్ల వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగిందని రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ సునీల్ ని, ఎంపీ అభ్యర్థి రెడ్డప్పని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి నా సాయి శక్తుల కృషి చేస్తానని రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండలం వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితులు పాల్గొన్నారు.