తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో దేశానికే ఆదర్శం: సుర్వి యాదయ్య గౌడ్

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 16:తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో దేశానికే ఆదర్శమని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం అందించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు గానుప్రభుత్వ ఖజానా పై ప్రతి యేటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడుతున్న ప్రజా సంక్షేమ ముఖ్యమని తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నందన్నారు.

Scroll to Top