నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 21: గత ఎమ్మెల్యేలు చేయలేని విధంగా, నందిగామను అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మేల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం నందిగామ పట్టణంలోని 10 వ వార్డులో పాత కరెంట్ ఆఫీస్ ఏరియాలో ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు, సీట్లు కోసం ఆలోచించే మనస్తత్వం తమది కాదని ప్రజల అవసరాల కన్నా రాజకీయాలు ఎక్కువ కాదని ఎవరు సాహసం చేయని విధంగా సీఎం రోడ్డును విస్తరించి – ఎన్.టీ.ఆర్ రోడ్డుగా అభివృద్ధి చేశామన్నారు. నందిగామ మరింత అభివృద్ధి చెందాలనే దృక్పథంతో చందర్లపాడు రోడ్ – రామన్నపేట రోడ్ లను కూడా… విస్తరించి, డివైడర్ – సెంట్రల్ లైటింగ్ తో ఆధునీకరించి… నగరాన్ని తలపించే విధంగా అభివృద్ధి చేశాం… అక్కడ మరిన్ని పనులు చేయాల్సి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చూసి ఓర్వలేక… కుట్రలతో ఎన్నికల కమిషన్ కు & కోర్టులకు వెళ్లి… అభివృద్ధి పనులను, రోడ్ల విస్తరణ పనులను అడ్డుకున్నారు. ప్రజలకు – పట్టణానికి మేలు జరగాలన్నదే మా ఆకాంక్షన్నారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అనే భయంతో భీతితో పనులు ఆపాలన్నదే వారి తపన ప్రజలు ఆలోచించి ఓటు వేసి, నందిగామలో మార్పు ఎవరు తెచ్చారో గమనించి మద్దతు ఇవ్వండిని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.