నాంపల్లి, ప్రజానేత్రం, ఫిబ్రవరి 27: నాంపల్లి మండలం నామా నాయక్ తండాకి చెందిన వడ్త్యా శంకర్ నాయక్ ని బిజేపి గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా శంకర్ నాయక్ మాట్లాడుతు నా ఎన్నికకు సహకరించిన బిజేపి రాష్ట్ర, జిల్లా మండల నాయకత్వానికి ధన్యవాదములు. నాపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినందుకు అహర్నిశలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.