కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నుండి త్వరలోనే అవార్డు, మేడిపల్లి పోలీస్ సిబ్బందికి అభినందనల వెల్లువ
మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 14: దేశంలోని దాదాపు 17 వేల పోలీస్ స్టేషన్లలో 2023 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 76 పోలీస్ స్టేషన్లలో ఒకటిగా తెలంగాణ రాష్ట్రంలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్నిక చేసింది. ఈ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు పోలీస్ స్టేషన్లను సెలెక్ట్ చేశారు. అందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి ముగ్గురు సభ్యుల గల బృందం ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసర ప్రాంతాలు, స్టేషన్ మేనేజ్మెంటు, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, కేసు దర్యాప్తు వివరాలు మహిళలపై జరిగే నేరాల పట్ల, చిన్నపిల్లల పట్ల జరిగే నేరాల పట్ల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ ఎలా దాఖలు పరిశీలిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనాలను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా,శాంతి భద్రతలను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు. సేఫ్టీ విషయంలో గానీ సెక్యూరిటీ విషయంలో గానీ ప్రజలకు ఏ విధంగా పోలీసు వారు సహాయ సహకారాలు అందిస్తున్నారని, అత్యవసర సేవల డయల్ 100 వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏవిధంగా చేరువవుతున్నారని, బృందం సభ్యులు తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మల్కాజ్గిరి జానకి ధరావత్, ఐపీఎస్, ఏసిపి మల్కాజ్గిరి నరేష్ రెడ్డి, సిఐ గోవర్ధనగిరి, స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరూ పాల్గొన్నారు. దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎన్నిక కావడం పట్ల పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మేడిపల్లి పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపుతున్నారు.