నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు15: గ్రామీణ ప్రాంత ప్రజల మౌలిక వసతులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జెడ్పిటిసి ఎలిగోటి వెంకటేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం జడ్పిటిసి నిధుల నుండి మండలం కేంద్రంలోని మోడల్ స్కూలుకు రోడ్డు సౌకర్యం కోసం 10 లక్షల సీసీ రోడ్డు పనులతో పాటు పెద్దాపురం రూ.1.50, గౌరారం రూ.3, మల్లపురాజు పల్లి రూ.2 లక్షల రూపాయల పైప్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైపు దేశం చూస్తుందని అన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రజల అవసరాలను తీరుస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు జిల్లెల్ల యాదమ్మ సైదులు, కొమ్ము యాదమ్మ బిక్షం, మునగాల సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీలు సప్పిడి రాధిక శ్రీనివాస్ రెడ్డి, అన్నేపాక సరిత కిరణ్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్.కె అబ్బాస్ , సింగిల్ విండో మాజీ చైర్మన్ నక్క చంద్రశేఖర్, గెల్వాల్ రెడ్డి, నాంపల్లి నాగరాజు, తౌర్య, గుండెబోయిన శ్రీశైలం, పగిళ్ల శంకర్, సుందర బోయిన మల్లేష్, నాంపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.