నాంపల్లి ప్రజనేట్రం ఆగస్టు 25: ప్రజలకు మౌలిక వసతులతో పాటు ప్రజా సంక్షేమ పథకాలను వాళ్లకు అందించడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో లో ఓల్టేజీ సమస్యలు పరిష్కరించడానికి నూతన ట్రాన్స్ఫారంను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు, గృహ అవసరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్తును అందిస్తుందని అన్నారు .ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం సీఎం కేసిఆర్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు .దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మౌలిక వసతులు తీరుస్తున్న ప్రభుత్వం కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు . సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్ పక్షాన ప్రజలందరూ నిలబడవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నే యాదయ్య తదితరులు ఉన్నారు.