దివ్యాంగులకు అండగా సీఎం కేసీఆర్: కొమ్ము నర్సింహ

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని బిఆర్ఎస్ నాయకులు కొమ్ము నరసింహ అన్నారు. దివ్యాంగులకు పింఛన్ను రూ.3016 నుండి రూ. 4016 లకు పెంచగా సోమవారం మండల పరిధిలోని తుంగపాడులో దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు అధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. గతంలో దివ్యాంగులను ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని కనీసం వారి బాగోవులను కూడా చూడలేదన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కొరకు కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్ కు ప్రజలందరూ అండగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండి మూడోసారి గెలిపించి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దండిగ నరసింహ, మేకల దేవేందర్, పచ్చిపాల ఆంజనేయులు, దండిగా ఈదయ్య, పచ్చిపాల నరసింహ అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.

Scroll to Top