సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 16: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం గ్రామం ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు అందుకున్న గ్రామ కార్యదర్శి కోర్ర నరేష్ ను అభినందిస్తూ శనివారం గిరిజనులు సమక్షంలో ఘనంగా సన్మానం చేశారు. సంస్థాన్ నారాయణపురాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని గిరిజనుల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బానోతు బాలకిషన్, గిరిజన నాయకులు మెగావత్ నరసింహ నాయక్, బానోతు కిరణ్ కుమార్, బానోతు గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.