నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: మునుగోడును రెవిన్యూ డివిజన్ గా ప్రకటించడంతో పాటు ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు, మునుగోడును మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి చేయాలని, లేదంటే మునుగోడును నల్గొండ డివిజన్లోనే కొనసాగించాలని హెచ్చరించారు. మునుగోడు మండల కేంద్రంలో శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మునుగోడు అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సవతి ప్రేమ చూపిస్తున్నారని వాపోయారు. కనీసం మండల ప్రజా ప్రతినిధులకు, నాయకులకు మండల అభివృద్ధిపై సోయలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తక్షణమే స్పందించి మునుగోడుకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే అఖిలపక్షం, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం, ప్రజా సంఘాల, యువజన సంఘాల నాయకులు మల్ల యాదయ్య, తోట నరసింహ చారి, పందుల సురేష్, మందుల సైదులు, ఉధేయు కృష్ణ, ముచ్చపోతుల నరసింహ, నక్క వెంకన్న, ఉప్పుత్హుల లింగుస్వామి, జక్కలి ముత్యాలు, కుంభం చెన్నారెడ్డి, దాసరి గోవర్ధన్ యాదవ్, జడిగం సతీష్, పులకరం శివ, తదితరులు పాల్గొన్నారు.