నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: ఐక్యత, మత సామరస్యానికి చిహ్నం ఎమ్మేల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం పెండ్యాలలో జరిగే ఉరుసుకు తరలి వెళ్తున్న ఎడ్లబండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుర్లపాడు గ్రామంలోని హజరత్ అబూబకర్ ఉరఫ్ బడే మియా స్వామి దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొనడానికి పెండ్యాల గ్రామానికి చెందిన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల్లోని ముస్లిం సంతతికి చెందిన వారంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వేడుకల్లో పాల్గొంటారని హిందూ, ముస్లింలు ఉరుస ఉత్సవాలు జరుపుకుంటారన్నారు. మునేటి తీరాన ఉరుసు ఉత్సవాలకు ఎడ్లబండపై వెళ్తున్న భక్తులకు ఎంపీపీ మలక్ బషీర్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను, వాటర్ బాటిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.