రూ. 2 లక్షల 25 వేలకు లడ్డుని కైవసం చేసుకున్న అనంతుల ఉమా రెడ్డి స్వప్న దంపతులు

మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 01: బోడుప్పల్ కార్పొరేషన్ మూడో డివిజన్ మహాగణపతి నగర్ కాలనీలో కొలువైన గణనాథుని లడ్డు రూ. 2 లక్షల 25 వేలు పలికింది. కాలనీకి చెందిన అనంతుల ఉమా రెడ్డి, స్వప్న, దంపతులు వేలంపాటలో గణనాథుని లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకోగా ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొత్త చందర్ గౌడ్ పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలనీలో గణనాథునికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించిన భక్తులకు శుభాకాంక్షలు అని, వేలంపాటలో లడ్డుని, నాధుని కండువాని కైవసం చేసుకున్న భక్తులకు శుభాకాంక్షలు అని అన్నారు. ప్రతి పండుగను ఆనందోత్సవాలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. గణనాథ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కాలనీ ప్రధాన కార్యదర్శి కూరెళ్ల నరసింహ గౌడ్ అభినందించారు. కార్యక్రమంలో భక్తులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top