ప్రజాసేవలో 5 వసంతాలు పూర్తి చేసుకున్న “కమల హాస్పిటల్”

  • పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే “కమల హాస్పిటల్” లక్ష్యం: డాక్టర్ ఆశ అశోక్, కమల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్

మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 01: “వైద్యో నారాయణ హరి” అని మన పెద్దలు చెప్పిన విధంగా వైద్యుడు భగవంతుడితో సమానం,గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది నిరుపేదలకు సాధారణ ఫీజులతో కార్పోరేట్ స్థాయి వైద్యం విజయవంతంగా అందిస్తూ ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ‘కమల హాస్పిటల్”.డాక్టర్ ఆశా అశోక్ నిర్వహణలో బోడుప్పల్,పీర్జాదిగూడ పరిసర ప్రాంత పేద,మధ్యతరగతి ప్రజలకు సాధారణ ఫీజులతో అత్యాధునిక వైద్య పరికరాలతో, మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఐదు సంవత్సరాలుగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతుంది కమల హాస్పిటల్.ఈ సందర్భంగా కమల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆశా అశోక్ మాట్లాడుతూ కమల హాస్పిటల్ 5వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ తమ వంతు సామాజిక బాధ్యతగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కేవలం 2023 సంవత్సరంలోనే సుమారు 300 మంది మహిళలకు ప్రసూతి నిర్వహించామని, ప్రజలకు మరింత సేవలందించేందుకు ల్యాబ్ ఫీజులో 30% మందులలో 10% రాయితీ కల్పిస్తున్నామని,బోడుప్పల్, జంట కార్పొరేషన్ల ప్రజలు కమల హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్, కమల హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top