బోడుప్పల్ వెస్ట్ భీమ్ రెడ్డి నగర్ లో ఘనంగా గణేష్ నిమర్జనం…

ముఖ్య అతిథులుగా పాల్గొన్న కార్పొరేటర్ సింగిరెడ్డి దంపతులు

మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 01: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలో వెస్ట్ భీమ్ రెడ్డి నగర్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి- ఉషారాణి దంపతులు పాల్గొని గణపతి లడ్డు లక్కీ డ్రా ప్రారంభించి లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి లడ్డును అందించారు.అనంతరం కాలనీవాసులు ఆనందోత్సాహాల మధ్య మట్టి గణపతి విగ్రహాన్ని రథంపై కాలనీ వీధులలో శోభాయాత్ర నిర్వహించి అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నీటి తొట్టిలో గణనాథుని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కల్చరల్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షణ తమ బాధ్యతగా మట్టి గణపతిని ప్రతిష్టించి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించామని, కుంకుమార్చన,పుష్పాభిషేకం,మహా అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, వినాయక నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగియడానికి సహకరించిన దాతలకు ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్ సింగరెడ్డి పద్మారెడ్డి దంపతులకు కప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వెస్ట్ బీమ్ రెడ్డి నగర్ కల్చరల్ సొసైటీ సభ్యులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top