కన్నుల పండుగగా “శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం”

ముఖ్యఅతిథిగా పాల్గొన్న తుంగతుర్తి రవి…

మేడిపల్లి, ప్రజానేత్రం అక్టోబర్ 01: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ కమిటీ మేడిపల్లి వారి ఆధ్వర్యంలో మేడిపల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో “శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం” అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పరంజ్యోతి స్వరూపుడైన విశ్వకర్మ భగవానుడి యొక్క ఐదు ముఖాల నుండి మను బ్రహ్మ,మయ బ్రహ్మ,స్పష బ్రహ్మ,శిల్పి బ్రహ్మ,వైశ్య బ్రహ్మ, అను బ్రహ్మర్షులు ఉద్భవించి సమస్త వానవాళికి తమ తమ సేవలు అందిస్తున్నారని, విశ్వకర్మల సేవలు మరువలేనివని,ఈ యజ్ఞానికి అన్న ప్రసాద వితరణ చేసిన తుంగతుర్తి రవికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అదేవిధంగా తమ జీవితాలను కొవ్వొత్తుల మాదిరిగా కరిగిస్తూ సమాజ సేవలో విశ్వకర్మలు వీళ్ళ తరబడి కష్టపడుతున్నారని,ఆర్థిక సామాజిక,రాజకీయ రంగాలలో ఎదగలేకపోతున్నారని,ఇప్పటికైనా ప్రభుత్వాలు విశ్వకర్మలను గుర్తించి చేయూత అందించాలని అన్నారు.

Scroll to Top