చిట్యాల, ప్రజానేత్రం, అక్టోబర్ 01: యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీలలో చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని సౌమ్య విద్యామందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రుద్రారపు మల్లేష్ తెలిపారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు జిల్లా విద్యాధికారి బొల్లారం భిక్షపతి, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు కుంభం నర్సిరెడ్డి, కార్యదర్శి నంద్యాల నర్సిరెడ్డి బంగారు పతకాలను అందజేశారు. అండర్ 8 -10 బాలుర విభాగంలో చిలివేరు శ్రీరాం, మెట్టు యశ్వంత్ అండర్ 10-12 బాలికల విభాగంలో మెట్టు వర్షిత, బాలుర విభాగంలో కొండ విశ్వసాయి, రుద్రారపు శివసాయి, బొమ్మగోని హేమంత్, 12-14 బాలికల విభాగంలో కొండ అఖిల, బాలుర విభాగంలో మెట్టు మణికుమార్, ఆవుల వంశీ ఎంపికయ్యారు. వీరు రాష్టస్థ్రాయి పోటీలలో పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బొడిగె విజయ్ కుమార్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు.