నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: టియుడబ్ల్యూజే(ఐజేయు) నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శిగా పొలగోని లక్ష్మీకాంత్ నియామకం అయ్యారు. బుధవారం ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గార్లపాటీ కృష్ణారెడ్డి, మారబోయిన మధుసూదన్ లు నియామకం పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. తమ ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నలగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు పులిమామిడి మహేందర్ రెడ్డి, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షుడు దొటి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.