నార్కట్ పల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 16: బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రంకు సంతరించుకున్న జలకళను చూసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెళ్లెంల గ్రామంలో గల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ను వారు సందర్శించారు, ముఖ్యమంత్రి కేసీఅర్ చొరవతోనే ప్రాజెక్ట్ లోకి నీళ్ళు వచ్చాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అద్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, కొండూరు శంకర్ గౌడ్, చిక్కుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.