సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 20: సూర్యాపేట జిల్లా కావడమే ఓ చరిత్రని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం సూర్యపేటలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యపేట జిల్లా ప్రగతి చూస్తుంటే ఆనందం గా ఉంది, సూర్యపేట జిల్లాలో ఉన్న 475 గ్రామ పంచాయతీ లకు 10 లక్షల చొప్పున స్పెషల్ నిధులు మంజూరుకు హామీనిచ్చారు. సూర్యపేట మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేస్తామన్నారు. రైతు రుణమాఫీ చేయమని కొట్లాడిన మొదటి వ్యక్తి మన మంత్రి జగదీష్ రెడ్డి అని అన్నారు. సూర్యపేటలో ఆర్ అండ్ గెస్ట్ హౌస్, కళా భారతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో జగదీష్ రెడ్డి ని గెలిపిస్తే సూర్యపేట జిల్లా గా ఏర్పాటు చేస్తా అని చెప్పిన చేసిన కూడా మంత్రి గా కూడా చేస్తా అని చెప్పిన చేసిన. ఇవ్వాళ. అభివృద్ధి పరుగులు పెడుతుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏమన్నా కొత్తవా, వల్ల సక్కదానం తెల్వదా, ఏనాడైనా అభివృద్ధి గురించి ఆలోచన చేసారా కాంగ్రెస్ వాళ్లు నల్గొండ పట్టణం సర్వాంగసుందరంగా అభివృద్ధి చేసినం మనకు కులం, జాతి మతం, లేదు అందరూ మనవాళ్లే. అందరి బాగు కోసం కృషి చేస్తున్నాం. కాంగ్రెస్ వల్ల కు ఓటేస్తే ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు? అందరూ ప్రశ్నించాలి… తుంగతుర్తి, సూర్యపేటలలో సాగు నీళ్లు ఎట్లా వస్తున్నాయో మిరే చూస్తున్నారు ఇవ్వాళ అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. కర్ణాటక లో కూడా కరంట్ కోతలు విధిస్తున్నారు కాంగ్రెస్ వాళ్లు. ఒకడు 3 గంటలు కరంట్ చాలు అని ఒకడు అంటాడు వీళ్ళను నమ్మల్న చెప్పండి, ధరణి వచ్చిన తర్వాత వ్యవసాయ స్థలాల క్రయ విక్రయాలు అత్యంత పారదర్శకంగా మారింది, అలాంటి ధరణి ని రద్దు చేస్తా అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు రైతు భీమా అమలు చేస్తున్నాం, ధరణి వల్ల అన్నదాతల బ్యాంక్ అకౌంట్ లాల్లో రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నాం, ఎక్కడ అవినీతి లేదు ధరణి తీసేస్తా అనేటోళ్లను గంగలో కలపాలి ఓట్లు వచ్చినప్పుడు ఆగం కావొద్దు ధరణి తెచ్చి అన్నదాతలకు అధికారాలను అప్పజెప్పాము మళ్ళీ ఆ అధికారాలను గుంజుకునే కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్లు రైతులు జాగ్రత్తగా ఉండాలి విచక్షణ తో ఆలోచన చేయాలి ఎన్నో పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నాం అవి అన్ని మీ కళ్ళ ముందు వున్నాయి మిరే చూస్తున్నారు. సూర్యపేటకు కాళేశ్వరం జాలాలు వచ్చాయా అని మొన్న ఒక కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నింస్తున్నాడువచ్చి చూడు ఎక్కడ చూసినా కనిపిస్తాయి అని చెప్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కి 12 ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్ గెలవాలి. మంత్రి జగదీష్ రెడ్డి నాతో కొట్లాడి జిల్లాలో 35 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు ప్రతిపక్షాలు అవి ఏవి నమ్మొద్దు సూర్యపేట లో 4ఎమ్మెల్యేలు స్థానాలు బంపర్ మెజారిటీ తో గెలుపించాలి. రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు 35 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు కోట్ల టన్నుల పంటలు పండిస్తున్నారు నా తెలంగాణ అన్నదాతలు రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లులు సరిపోవడం లేదు ఇవ్వాళ ఎంబీసీలకు కూడా ఆర్థిక చేయిత అందిస్తున్నామన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ ను అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిపారు సీఎం కేసీఆర్ అన్నారు. వస్తాదా అన్న అనుమానాలను బద్దలు చేసి స్వరాష్ట్రం ని సాధించారని, ఇవ్వాళ సూర్యపేట లో ప్రగతి పండుగ కనిపిస్తుందన్నారు. నేడు అభివృద్ధి పనులను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు సీఎం కేసీఆర్.. ఎట్లా ఉన్న సూర్యపేట ఎట్లా అభివృద్ధి ఛేదిందో అందరూ ఆలోచన చేయాలన్నారు. ఆనాడు సూర్యపేటలో ఆకలి కేకలు వినపడ్డాయి …ఆ నాడే కేసీఆర్ ఊర్లు తిరిగి ధైర్యం చెప్పారు.. ఫ్లోరైడ్ భాదితులకు అండగా నిలబడ్డారు. చేనేతలకు అండగా నిలిచారు. ఆరు ఏండ్ల లో తెలంగాణను అన్నపూర్ణ గా నిలిపారు. కృష్ణా గోదావరి జలాలతో సూర్యపేట పచ్చగా సస్యశ్యామలం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సూర్యపేట రూపురేఖలు మారి పోయాయని, 400 కిలోమీటర్లు ప్రయాణించి సూర్యపేటలోని రావి చెరువు కు గోదావరి జలాలు చేరుతున్నాయన్నారు. సూర్యపేట ప్రజలకు మురికి నీళ్లు తాపించిన నిచులు కాంగ్రెస్, టీడీపీ నాయకులు, ఇవ్వాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి అందిస్తున్నాం. సూర్యపేట టౌన్ లో రెండు మినీ ట్యాంక్ బండ్ లను నిర్మాణం చేశారు. సీఎం కేసీఆర్ సూర్యపేట రూపురేఖలు మార్చిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ ఆలీ, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గాదరి కీశోర్ కుమార్, గొంగడి సునీత, శానంపూడి సైది రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, బొల్లం మల్లయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.